Pages

Tuesday, June 28, 2011

మంత్రాల నెపంతో మహిళపై దాడి

వరంగల్ : వరంగల్ జిల్లాలో పజలుమూఢ నమ్మకాలు ఇంకా విశ్వసిస్తూనే ఉన్నారు. మంత్రాల నెపంతో ఓ మహిళను దారుణంగా కొట్టి అనంతరం పెట్రోల్ పోసి నిప్పు అంటించేందుకు గ్రామస్తులు యత్నించారు. ఈ సంఘటన కొడకొండ్ల మండలం పాకాలలో చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్తులను అడ్డుకునేందుకు యత్నించగా వారు తీవ్రంగా ప్రతిఘటించి పోలీసుల కళ్లలో కారం చల్లారు. ఎట్టకేలకు గ్రామస్తులను పోలీసులు కట్టడి చేయగలిగారు. తీవ్రంగా గాయపడిన మహిళకు కొడకొండ్ల ప్రభుత్వ ఆస్పత్రికు తరలించి చికిత్స అందిస్తున్నారు.

No comments:

Post a Comment