హైదరాబాద్ : విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రజాస్వామ్య విరోధి అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయనకు అవగాహన లేదని ఈటెల అన్నారు. 14 ఎఫ్‌పై లగడపాటి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు బుధవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేశారు.
అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటరీ వ్యవస్థను అవమానపరిచిన లగడపాటి ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరతామన్నారు.
తెలంగాణ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన లగడపాటిపై చర్య తీసుకోవాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేసినట్లు సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్, బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ తెలిపారు.
No comments:
Post a Comment