Pages

Tuesday, June 28, 2011

‘టీవీ 9 తప్పుడు ప్రచారం చేస్తోంది’

ప్రశాంతినిలయంలో సత్యసాయి బాబా మహాసమాధి వద్దకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదరక్షలు వేసుకుని వెళ్లలేదని అనంతపురం ఎమ్మెల్యేల గుర్నాథరెడ్డి స్పష్టం చేశారు. జగన్ చెప్పులు వేసుకుని వెళ్లలేదని, ఈ విషయాన్ని ‘టీవీ 9’ ఛానల్ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. టీవీ9 ప్రచారాన్ని గుర్నాథరెడ్డి తీవ్రంగా ఖండించారు.

వైఎస్ జగన్‌తో పాటు తామంతా వాహనాల్లోనే చెప్పులు వదిలి ప్రశాంతి నిలయంలోకి ప్రవేశించామని తెలిపారు. కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది చెప్పులేసుకుని ప్రవేశించి ఉంటే అది జగన్‌కు ఆపాదించటం సరికాదని గుర్నాథరెడ్డి వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment