Pages

Tuesday, June 28, 2011

బుల్లెట్ రైలును పరీక్షించిన చైనా


బీజింగ్: అత్యధిక వేగంతో ప్రయాణించే బుల్లెట్ ైరె లును చైనా సోమవారం బీజింగ్, షాంఘైల మధ్య పరీక్షించింది. 1,318 కిలోమీటర్లు సాగిన ఈ ప్రయాణంలో ప్రభుత్వ అధికారులు, రైల్వే లైన్‌ను నిర్మించిన వివిధ కంపెనీలకు చెందిన మేనేజర్లు, పాత్రికేయులు పాల్గొన్నారు. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వెళ్లే బుల్లెట్ రైలు ఆ దూరం ప్రయాణించడానికి కేవలం ఐదుగంటల సమయం మాత్రమే పడుతుంది. సాధారణ రైళ్లతో పోలిస్తే ఈ సమయం చాలా తక్కువ. చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) స్థాపించి 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 30న బుల్లెట్ రైలును ప్రవేశపెట్టనున్నారు. బీజింగ్-షాంఘై రైల్వేలైన్లో గంటకు 250 నుంచి 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే 63 జతల రైళ్లను ప్రతిరోజు నడపనున్నామని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో టికెట్ ధరలు రూ. 2,900 నుంచి రూ. 12,000 వరకు ఉంటాయని పేర్కొంది. ఈ ఏడాది చివరికల్లా వాటికోసం 13,000 కి.మీ. మేరకు ట్రాక్‌లను నిర్మించనున్నట్టు తెలిపింది. అత్యధిక వేగం, చార్జీల కారణంగా ఈ రైళ్లపై వివాదాలు నెలకొన్నాయి.

No comments:

Post a Comment